సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-12-30T04:22:07+05:30 IST

గ ట్టు ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్‌కు పూల మొక్క ఇచ్చి కృతజ్ఞతలు చెబుతున్న ఎమ్మెల్యేలు

గద్వాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గ ట్టు ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణం ప్రారంభించాలని, హైదరాబా ద్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించి న నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారు ల సమావేశంలో సీఎం అధికారులను ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా క లిశారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులకు శ్రీ కారం చుట్టనున్న సందర్భంగా నియోజకవర్గ రై తులు, ప్రజల తరపున పూలమొక్కను అందిం చి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పీ విజయ్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు సర్వా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్వాల జి ల్లా పరిషత్‌ కార్యాలయం ముందు జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2020-12-30T04:22:07+05:30 IST