-
-
Home » Telangana » Mahbubnagar » mla mahipal reddy
-
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2020-12-11T04:12:28+05:30 IST
పఠాన్‌చెరువు ఎమ్మెల్యే మహి పాల్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్, కార్యదర్శి రమేశ్‌రావు, పా న్‌గల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తలకంటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు.

పాన్‌గల్, డిసెంబరు 10: పఠాన్‌చెరువు ఎమ్మెల్యే మహి పాల్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్, కార్యదర్శి రమేశ్‌రావు, పా న్‌గల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తలకంటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. జర్నలిస్టు సంతోష్ నాయక్ ను ఎమ్మెల్యే చంపేస్తానని ఫోన్లో బెదిరించడం హేయమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశీనాథ్, జర్నలిస్టు సంఘం నాయకులు నయ న్‌ఖాన్, రాములుయాదవ్, రాములు పాల్గొన్నారు
క్రిమినల్ కేసు నమోదు చేయాలి
వనపర్తి అర్బన్: మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహ న్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గు రువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ స్పం దించి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.