రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-06T04:06:54+05:30 IST

రైతులకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉందని ఎమ్మెల్యే డా క్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు.

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అబ్రహం

ఇటిక్యాల, డిసెంబరు 5: రైతులకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉందని ఎమ్మెల్యే డా క్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. మండ లంలోని జింకలపల్లి దగ్గర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులనుద్దేశించి మాట్లాడారు. మద్దతుధరతో ఽధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించొద్దన్నారు. జడ్పీటీసీ సభ్యుడు హన్మంతురెడ్డి, సర్పంచులు ఈదన్న, రవీందర్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు గిడ్డారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సుంకన్న పాల్గొన్నారు.


ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం


వడ్డేపల్లి : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర తో కొనుగోలు చేస్తా మని పీఏసీఎస్‌ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శాంతినగర్‌లో శనివారం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.  రైతులు తమ ధాన్యంను కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని   సూచించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ, వైస్‌ చైర్మన్‌ సుజాత, ఏవోరాధ, రాజు, గడ్డం శ్రీను, బాబీ, వెంకట్రామన్‌గౌడ్‌ ఉన్నారు.


Updated Date - 2020-12-06T04:06:54+05:30 IST