గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కృషి

ABN , First Publish Date - 2020-12-12T04:21:07+05:30 IST

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అన్నివిధాలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కృషి
డంపింగ్‌ యార్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

    ధరూరు, డిసెంబరు 11 : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అన్నివిధాలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దపాడు గ్రామంలోని డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో భాగంగానే గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, గ్రామాల్లో సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌యార్డులు, శ్మశానవాటిక నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసాబేగం, జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T04:21:07+05:30 IST