కొత్త చట్టాలు రైతులకు ఉరితాళ్లు
ABN , First Publish Date - 2020-12-06T04:10:18+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్య వసాయ చట్టాలు రైతుల మెడకు ఉరి తాళ్లు అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, డిసెంబరు 5: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్య వసాయ చట్టాలు రైతుల మెడకు ఉరి తాళ్లు అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అధ్యక్ష తన అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ గడిచిన ఏడేళ్లలో బీజేపీ ప్ర భుత్వం కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీలకు లాభం చేకూర్చేం దుకు శ్రమిస్తున్నాయని ఆ రోపించారు. డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పుట్ట ఆంజనేయులు, బాల్‌రెడ్డి, మండ్ల రాజు, కురుమయ్య, శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌నాయక్, సతీష్‌యా దవ్, బాబా, వెంకటయ్యయాదవ్, దస్తగిరి, డీ.చంద్రయ్య, అరుణ్‌కుమార్, సత్యం సాగర్ తదితరులు పాల్గొన్నారు.