-
-
Home » Telangana » Mahbubnagar » mla bandla krishnamohan reddy programme
-
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T03:30:28+05:30 IST
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెం టనే రద్దు చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ధరూరులో ఆయన మంగళవారం ఇంటింటికి తిరుగుతూ పిడికెడు ధాన్యం సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
ధరూరు, డిసెంబరు 15: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ధరూరులో ఆయన మంగళవారం ఇంటింటికి తిరుగుతూ పిడికెడు ధాన్యం సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేకరించిన బియ్యాన్ని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు అందిస్తామన్నారు. జడ్పీ వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ, రైతు సమన్వయ సమితి నాయకుడు చెన్నయ్య, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ రామేశ్వరమ్మ, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీలు నజుమున్నిసాబేగం, ప్రతాప్‌గౌడు, జడ్పీటీసీలు పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీలు శివలీల, దౌలన్న, కేటీఆర్ యువసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిక
ధరూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు రఘునాధ్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసాబేగం, జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు జాకీర్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.