రైతు బాంధవుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-12-11T03:44:34+05:30 IST

సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని పులికల్‌ గ్రామంలో గురువారం ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతు బాంధవుడు కేసీఆర్‌
పులికల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

- ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం

    అయిజ, డిసెంబరు 10 : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని పులికల్‌ గ్రామంలో గురువారం ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందన్నారు. అయిజలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా సహకార అధికారి ప్రసాదరావు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలోని ఐదు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు సింగిల్‌విండో అధ్యక్షుడు పో తుల మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచు గోవర్ధనమ్మ కిశోర్‌, ఎంపీటీసీలు ప్రహ్లాదరావు, నర్సింహులు, నా యకులు ఎక్లాస్‌పూర్‌ నర్సింహారెడ్డి, చిన్నహన్మంతు, రంగు శ్రీధర్‌, నాగిరెడ్డి, నాగన్‌గౌడు, వేమారెడ్డి, మేడికొండ వెంకటేష్‌, ముక్తర్‌, దేవన్న, వెంకటేష్‌, రాముడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T03:44:34+05:30 IST