244 గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

ABN , First Publish Date - 2020-12-30T04:06:42+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవర కద్ర వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలో జేసీబీ తగిలి మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ జాయింట్‌ పోయింది.

244 గ్రామాలకు  మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

నారాయణపేట, డిసెంబరు 29 : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవర కద్ర వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలో జేసీబీ తగిలి మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ జాయింట్‌ పోయింది. దీంతో మంగళ వారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు నారాయణపేట, మక్త ల్‌ పట్టణాలతో పాటు 244 గ్రామాలకు నీటి సరఫరా ఉండదని మిషన్‌ భగీరథ అధి కారులు మంగళవా రం ఓ ప్రకటనలో తె లిపారు. దేవరకద్ర మండలంలోని 33 గ్రా మాలు, నర్వలో 18, మరికల్‌లో 20, ధ న్వాడలో 8, ఊట్కూ ర్‌లో 32, మక్తల్‌లో 26, మాగనూర్‌లో 4, పేట మండలంలోని 46 గ్రామాలు, దామ రగిద్ద మండలంలోని 38 గ్రామాలకు నీటి సరఫరానిలిచిపోతుం దని, దీనిని గమనిం చి ప్రజలు సహకరిం చాలని అధికారులు కోరారు. త్వరలోనే పు నరుద్ధరిస్తామన్నారు. 

Updated Date - 2020-12-30T04:06:42+05:30 IST