మిరపకు వింత తెగులు.. బూజుపట్టి రాలిపోతున్న కాయలు

ABN , First Publish Date - 2020-12-11T03:49:48+05:30 IST

అంతు చిక్కని తెగులుతో మిరప పం ట నాశనం అవుతోంది.

మిరపకు వింత తెగులు.. బూజుపట్టి రాలిపోతున్న కాయలు
బూజుపట్టి రాలిపోయిన మిరపకాయలు

అయిజ, డిసెంబరు 10 : అంతు చిక్కని తెగులుతో మిరప పంట నాశనం అవుతోంది. అయిజతో పాటు, మండలంలోని తుపతురాల, పర్దిపూర్‌ తదితర గ్రామాల్లో మిరప పంట విస్తారంగా సాగవుతోంది. కొద్ది రోజులుగా మిరప ఆ కులు, కాయలపై తెల్లని మచ్చలు వస్తున్నాయి. అవి బూజు పట్టి, బరువును కోల్పోయి నేల రాలుతున్నాయి. ముందు కొన్ని మొక్కలకు ఈ తెగులు సోకి పంటకంతకూ వ్యాపిస్తోంది. అధికవర్షాలు, మంచుతో ఇలా జరుగుతోందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఆంత్రాక్నోస్‌ అనే శిలీంద్రం వల్ల పంటకు ఇలా నష్టం జరుగుతోందని కొందరు రైతులు తెలిపారు. పంటను శాస్త్రవేత్తలు పరిశీలించి, పంటను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు.  

Updated Date - 2020-12-11T03:49:48+05:30 IST