అంబేడ్కర్‌ ఆదర్శం

ABN , First Publish Date - 2020-04-15T10:36:45+05:30 IST

భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ ఆదర్శం

ఘనంగా నివాళి అర్పించిన మంత్రులు


 వనపర్తి అర్బన్‌, ఏప్రిల్‌ 14: భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆయన 129వ జయంతి పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మనిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ పాల్గొన్నారు.


అంబేడ్కర్‌ మార్గం అనుసరణీయం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానంతో దేశఔన్నత్యానికి అందరం పాటుపడాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అంబేడ్కర్‌ 129వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావుతో కలిసి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-15T10:36:45+05:30 IST