-
-
Home » Telangana » Mahbubnagar » Ministers Programme
-
కేసీఆర్ పాలనలోనే పేదల సంక్షేమం
ABN , First Publish Date - 2020-12-31T03:29:47+05:30 IST
అట్టడుగు వర్గా ల సంక్షేమం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాకారమైందని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు.

- మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్
(నాగర్‌కర్నూల్-ఆంధ్రజ్యోతి)/బిజినేపల్లి/తెలకపల్లి, డిసెంబరు 30 : అట్టడుగు వర్గా ల సంక్షేమం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాకారమైందని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు వారు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్లు, పాలెంలో రైతు చైతన్య వేదిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ శర్మన్‌లు హాజరయ్యారు. ఉయ్యాలవాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం పట్ల టీఆ ర్‌ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందన్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల పట్ల ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉందని, రైతు వేదికలు వ్యవసాయాన్ని మెరు గుపరిచే ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. చిల్లర పంచాయితీలతో బీజేపీ నా యకులు ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత వ్యవసాయ అ భివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని కొనియాడారు. కార్యక్ర మంలో టీఆర్‌ఎస్ నాయకులు జక్క రఘునందన్‌రెడ్డి, బైకాని శ్రీనివాస్‌యాదవ్, గంగన మోని కిరణ్, బిజినేపల్లి, తెలకపల్లి ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, కొమ్ము మధు, బిజినేపల్లి జడ్పీటీసీ హరిచరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.