మట్టి గణపతులను పంపిణీ చేసిన మంత్రి

ABN , First Publish Date - 2020-08-22T10:53:02+05:30 IST

వినాయక చవితిని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం పాలమూరు పురపాలిక కార్యాలయంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.

మట్టి గణపతులను పంపిణీ చేసిన మంత్రి

రాజేంద్రనగర్‌: వినాయక చవితిని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం పాలమూరు పురపాలిక కార్యాలయంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గడియారం చౌరస్తాలో చేపడుతున్న జంక్షన్‌ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, కమిషనర్‌ సురేందర్‌, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-22T10:53:02+05:30 IST