వ్యవసాయ రంగానికి పెద్ద పీట
ABN , First Publish Date - 2020-07-08T11:21:36+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిం దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
భూత్పూర్, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిం దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భూత్పూర్ మునిసిపల్ చై ర్మన్ బస్వరాజుగౌడ్ ఇంటి దగ్గర మంగళవారం ఏర్పా టుచేసిన ప్రత్యేక సమావేశా నికి ఆయన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి, మరో 50 మంది యువకులు బీజేపీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం మంత్రి మా ట్లాడారు. కేఎల్‌ఐ కాలువల ద్వారా ఎండాకాలంలోనే గొలుసు కట్టుతో చెరువులను నింపి అలుగులు పారించడం జరింగిందని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వ లేక కొందరు పని కట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. గతంలో ఒక్క ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు నేడు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరంలో రెండు పంటలకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పన సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. కర్వెన రిజర్యూయర్ పూర్తి అయితే పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 37రైతు వేదికలు నిర్మించబోతు న్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీ నివాసులు, ఎంపీపీ డాక్టర్ కదిరె శేఖర్ రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, వార్డు కౌన్సి లర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నారాయణగౌడ్, మురళీధర్‌గౌ డ్, బాలస్వామి పాల్గొన్నారు.