మిషన్‌ భగీరథ నీరే పరిపుష్టి: మంత్రి

ABN , First Publish Date - 2020-10-03T09:52:59+05:30 IST

మిషన్‌ భగీరథ నీటితో పరిపుష్ఠి లభిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మిషన్‌ భగీరథ నీరే పరిపుష్టి: మంత్రి

వనపర్తి పురపాలకం, అక్టోబరు 2: మిషన్‌ భగీరథ నీటితో పరిపుష్ఠి లభిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అర్బన్‌ మిషన్‌ భగీరథ పైలాన్‌కు శంకు స్థాప న చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, పెరిగే చిన్నపిల్లలు, వృద్ధు లకు మిషన్‌ భగీరథ నీరే పరిపుష్టి అని అన్నారు. భవిష్యత్‌లో మరో రెండు తరాల వరకు వనపర్తి పట్టణంలో తాగునీటి సమస్య ఉత్పన్నం కావొద్దని, రూ.34.75 కోట్లతో  కొత్త పైపులైన్‌, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. మార్చిలోగా పను లు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ఇప్పటి నుంచి ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కనపడొద్దని పట్టణ ప్రజలు మిషన్‌ భగీరథ నీరే తాగాలని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌, కమిషన్‌ మహేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T09:52:59+05:30 IST