అన్నం పెట్టే రైతుకే ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-07-08T11:23:45+05:30 IST
ప్రపంచానికే అన్నం పెడుతున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాశాఖ ..

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
తిమ్మాజిపేట, బిజినేపల్లి/తాడూరు/జూలై 7: ప్రపంచానికే అన్నం పెడుతున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి, మారేపల్లి గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి మొక్కలు నాటారు.