-
-
Home » Telangana » Mahbubnagar » Minister Mallareddy Dishti toy burning
-
మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2020-12-31T03:55:39+05:30 IST
న్యాక్ అక్రిడిటేషన్ కోసం తప్పుడు ధ్రు వపత్రాలను సమర్పించిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవా లని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.

మరికల్, డిసెంబరు 30 : న్యాక్ అక్రిడిటేషన్ కోసం తప్పుడు ధ్రు వపత్రాలను సమర్పించిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవా లని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో దహనం చేశా రు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్ సందీప్ మాట్లాడు తూ తప్పుడు పత్రాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు మల్లారెడ్డి విద్యాసంస్థలను బ్లాక్‌లిస్టులో ఉంచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. మల్లారెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నవీన్, శివ, మహేష్ పాల్గొన్నారు.