-
-
Home » Telangana » Mahbubnagar » Medical checkups for migrant workers
-
వలస కూలీలకు వైద్యపరీక్షలు
ABN , First Publish Date - 2020-05-13T06:08:35+05:30 IST
లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు తిరిగి వస్తున్న వలస కూలీలకు ప్రతి రోజూ రెం డు సార్లు వైద్యపరీక్షలు

వనపర్తి కలెక్టరేట్, మే 12: లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు తిరిగి వస్తున్న వలస కూలీలకు ప్రతి రోజూ రెం డు సార్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో చంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల ఇతర రాష్ట్రాలనుంచి 1472 మంది వలస కూలీలు జిల్లాకు తిరిగి వచ్చార న్నారు.
వీరందరూ వారి స్వంత గ్రామాలకు చేరుకున్నారని, గ్రామ బృం దాలతో పాటు మండల టాస్క్‌ఫోర్స్ బృందాలు నిత్యం సమాచారాన్ని సేకరి స్తున్నట్లు ఆయన తెలిపారు. తాము కూడా ఆయా గ్రామాలను సందర్శించి వచ్చిన కూలీలతో పాటు ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. మొదటి నుంచి జిల్లా యంత్రాంగం కట్ట దిట్టమైన ఏర్పాట్లతో కరోనా వైరస్ కట్టడి కోసం పని చేయడంతో ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదని, వనపర్తి జిల్లా గ్రీన్ జోన్‌లో ఉందన్నారు.