రేపు కొబ్బరికాయల విక్రయానికి వేలం

ABN , First Publish Date - 2020-03-04T10:40:37+05:30 IST

రేపు కొబ్బరికాయల విక్రయానికి వేలం

రేపు కొబ్బరికాయల విక్రయానికి వేలం

చారకొండ, మార్చి 3 : మండలంలోని సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థాన కల్యాణ మంటపంలో గురువారం మధ్యాహ్నం 2గంటలకు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఢేరం మల్లికార్జునశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోతవాల్లో భాగంగా గుట్టపై తలనీలాలు, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు, స్వామి వారి ప్రసాదము విక్రయించేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, ప్రసాదానికి, తలనీలాలకు రూ.లక్ష చొప్పున, కొబ్బరి చిప్పలకు రూ.50వేలు డిపాజిట్‌ చేసి వేలం పాటలో పాల్గొనాలన్నారు.

Updated Date - 2020-03-04T10:40:37+05:30 IST