ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-03-04T10:40:19+05:30 IST

ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలి

ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలి

చారకొండ, మార్చి 3 : సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం గుట్టకింద ఆలయ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి సీపీఐ జిల్లా నాయకుడు సీహెచ్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుట్ట కింద దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఇండ్లు నిర్మించుకున్న వారితో అనుమతి తీసుకోవాల్సి వస్తుందని దీంతో చిరువ్యాపారులు వారు అడిగినంత ఇవ్వడంతో ఉపాధి కోల్పోతున్నారన్నారు. చిరువ్యాపారుల వద్ద డబ్బులు వసులు చేసే వారిపై పాలకవర్గం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంజయ్య, ఆంజనేయులు, పెంటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T10:40:19+05:30 IST