కరోనా పట్ల అవగాహన కల్పించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-13T10:37:57+05:30 IST
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యా లయంలో కొవిడ్‌పై వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ నవంబర్ 12: కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యా లయంలో కొవిడ్‌పై వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు. సెకండ్ వేవ్ సందర్భంగా ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. కరపత్రాలను ముద్రించి పట్టణాలు, గ్రామాలలో పంపిణీ చేయాలని ఆదేశించారు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడాలని, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. గతంలో మాదిరిగానే టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని డీపీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరోనా వైరస్ పట్ల తీసుకుంటున్న చర్యలపై అంశాల వారిగా సమీక్షించారు. జిల్లా ఆసు పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్‌ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు కిట్ల సరఫరా, బోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. సమీక్షలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ క్రిష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శంకర్ తదితర వైద్యులు పాల్గొన్నారు.