తహసీల్దార్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-08T07:21:11+05:30 IST

పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రి ప్రాగంణంలో నిర్మించిన నూతన భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు.

తహసీల్దార్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం

జడ్చర్ల, అక్టోబరు 7: పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రి ప్రాగంణంలో నిర్మించిన నూతన భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కార్యాలయ భవనం వర్షం పడితే నీళ్లు కారుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగొద్దని కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


 కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, తహ సీల్దార్‌ లక్ష్మీనారాయణ, జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, నాయకులు సీతారాం, కాట్రపల్లి లక్ష్మయ్య, రేణుక, రవిశంకర్‌, గోవర్ధన్‌రెడ్డి, మురళి, జి.సత్యం, రమేష్‌, జీవన్‌ గుండప్ప, శంకర్‌ నాయక్‌, ఇమ్ము, పరమటయ్య, రఘుపతిరెడి పాల్గొన్నారు. 

 

ట్యాంక్‌ బండ్‌ పనులు ప్రారంభం: పట్టణంలోని నల్లకుంటలో నిర్మిస్తున్న ట్యాంక్‌ బండ్‌ పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. పనులు త్వరగా, నాణ్యతగా జరిగేలా చూడాలని కమిషనర్‌ సునితకు, కాంట్రాక్టర్‌కు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మిశివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, మురళి, రేణుక, కాట్రపల్లి లక్ష్మయ్య, సీతారాం, బాద్మి రవిశంకర్‌, సత్యం, దేవ, హబీబ్‌, అశ్వక్‌, ఇమ్ము, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-08T07:21:11+05:30 IST