-
-
Home » Telangana » Mahbubnagar » mbnr
-
గద్వాల మునిసిపాలిటీ కౌన్సిలర్లకు నోటీసులు
ABN , First Publish Date - 2020-03-13T10:59:07+05:30 IST
గద్వాల మునిసిపాలిటీ కౌన్సిలర్లకు నోటీసులు

- మునిసిపల్ ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన
గద్వాల, మార్చి 12 ( ఆంధ్రజ్యోతి) : గద్వాల మునిసిపాలిటీలో 16 మంది కౌన్సి లర్లకు కోర్టు నుంచి గురువారం నోటీసులు జారీ అయ్యాయి. మునిసిపాలిటీ ఎన్నికల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన ట్లు దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఈ నోటీసు లను జారీ చేసింది. నామినేషన్ల సందర్భం గా దాఖలు చేసిన అఫిడవిట్లలో సరైన సమాచారం ఇవ్వలేదని, లెక్కలు సక్రమం గా అప్పగించలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గద్వాల మునిసిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌ను ప్రశ్నించినపుడు నోటీసులు వచ్చింది వాస్తవమేనని తెలిపారు.