ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-03-13T10:55:50+05:30 IST

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌

వడ్డేపల్లి, మార్చి 12 : టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ విమర్శించారు. బడ్జెట్‌లో తుమ్మిళ్లకు రూ.391 కోట్లు కేటాయిం చినట్లు ఎమ్మెల్యే అబ్రహాం చెప్పడం హాస్యా స్పందంగా ఉందన్నారు. శాంతినగర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలకు రూ.391 కోట్లు కేటాయించినట్లయితే టీఆర్‌ఎస్‌పై విమ ర్శలు చేయనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వారితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులకు తగిన బుద్ధి చెప్తామ న్నారు. సమావేశంలో నాయకులు చిట్టెమ్మ, శ్యాం, నరసింహనాయుడు, కృష్ణ, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌

Updated Date - 2020-03-13T10:55:50+05:30 IST