నిరంకుశ పాలకులకు గుణపాఠం నేర్పాలి

ABN , First Publish Date - 2020-03-13T10:54:06+05:30 IST

నిరంకుశ పాలకులకు గుణపాఠం నేర్పాలి

నిరంకుశ పాలకులకు గుణపాఠం నేర్పాలి

గద్వాలటౌన్‌, మార్చి 12: నిరంకుశ పాలకులకు ఐక్య పోరాటలతో గుణ పాఠం నేర్పాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన మాల మహానాడు జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70ఏళ్ల పాలనలో దేశంలో మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొ ట్టే పాలకులను ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. రైతులను ఆర్థికంగా ఆదు కుంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని చెబుతున్న పాలకులు లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల సొమ్మును కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విలువైన ప్రభుత్వ భూములు, పారిశ్రామిక వ్యాపార వర్గాల చేతిలో కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచి బంగారు తెలంగాణ సాధిస్తానంటున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. సమావే శంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోలి సైదులు, కార్యదర్శి తుమ్మల రవికుమార్‌, యువనాయకుడు మాధవ్‌, కృష్ణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌ కుమార్‌, మైనార్టీ నాయకులు అతీకుర్‌ రహిమాన్‌లు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాల శ్రీనివాసులు అధ్యక్షుడిగా గోవింద రాజులు ప్రధాన కార్యదర్శిగా రామక్రిష్ణలను ఉపాధ్యక్షుడిగా మాలమహానాడు జోగుళాంబ గద్వాల జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. మిగతా కార్యవర్గం అనుబంధ విభాగాలు, మండల కమిటీల ఏర్పాటు బాధ్యతలను వీరికి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. 

Updated Date - 2020-03-13T10:54:06+05:30 IST