పేద రైతుకు న్యాయం జరగాలి

ABN , First Publish Date - 2020-03-13T10:53:37+05:30 IST

పేద రైతుకు న్యాయం జరగాలి

పేద రైతుకు న్యాయం జరగాలి

పాలమూరు, మార్చి 12: పల్లెల్లో పని చేసుకొని జీవిస్తున్న పేద రైతు  డీసీసీబీ నుంచి సహాయం పొందినప్పుడే అందరికీ సమన్యాయం జరిగినట్లని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో జరిగిన మొదటి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. డీసీసీబీ చైర్మన్‌ చిట్యాల నిజాం పాష అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సహకార బ్యాంకు రైతులు, ప్రజలందరిదని, గత ప్రభు త్వాలు ప్రజలకు సంబంధం లేకుండా పని చేసిందని తెలిపారు. డబ్బు సంపా దించుకునేందుకు బయట అనేక మార్గాలు ఉన్నాయని, ఇక్కడ అందరికీ మేలు చేయటం ఎలా అనే పద్ధతిలో పని చేయాలని సూ చించారు. మూడేళ్ల లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పూర్తయితే రైతులు పూర్తిగా పంటలు పండించుకొని సుఖంగా జీవిస్తారన్నారు. డీసీసీబీలో ఏవైనాసమస్య లు తెలుసుకునేందుకు ఫిర్యాదుల పెట్టెలు ప్రతి బ్రాంచిలో పెట్టాలన్నారు. సహకార రంగం బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీసీసీబీ బృందం, పీఏసీఎస్‌ బృందం కలిసి ముల్కనూరును సందర్శించి మన ప్రాంతా న్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన చేసుకోవాలన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, డైరెక్టర్లు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మంజులారెడ్డి, జక్కా రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T10:53:37+05:30 IST