మాస్కులు, భౌతికదూరం పాటించని 64 మందికి జరిమానాలు

ABN , First Publish Date - 2020-05-11T10:53:34+05:30 IST

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు..మాస్కులు మ్యాండెటరీ కావడంతో వాటిని ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు.

మాస్కులు, భౌతికదూరం పాటించని 64 మందికి జరిమానాలు

రెండ్రోజుల్లో రూ.64 వేలు వసూలు


మహబూబ్‌నగర్‌, మే10:లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు..మాస్కులు మ్యాండెటరీ కావడంతో వాటిని ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్కులతోపాటు దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించని వారికి, దుకాణాల వద్ద శానిటైజర్‌ ఏర్పాటుచేయని వ్యాపారులకు కూడా జరిమానాలు విధిస్తున్నారు. పురపాలిక అధికారరులు, సిబ్బంది పెద్దఎత్తున రోడ్లపై తిరరుగుతూ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు.


శనివారం 31 మందికి రూ. 31 వేలు, ఆదివారం 33 మందికి రూ.33 వేలు జరిమానాలు విఽధించారు. అదేవిధంగగా మాస్కులు ధరించని వారికి మద్యం దుకాణాల వద్ద లిక్కర్‌ కూడా ఇవ్వడం లేదు. అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద భౌతిక దూరం విధిగా పాటించాలని, లేని పక్షంలో జరిమానాలు తప్పవని పురపాలక శాఖ అధికారరులు స్పష్ఠం చేస్తున్నారు. దుకాణాల వద్ద వ్యాపారులు కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చూసుకోవాలని లేదంటే వారికి కూడా జరిమానాలు తప్పవని చె బుతున్నారు. 


ఆదివారం బజార్‌ కిటకిట:

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత వచ్చిన మొదటి ఆదివారం రోడ్లన్నీ కిక్కిరిశాయి. జనం పెద్దఎత్తున రోడ్లపైకి రావడంతో పలు రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ముఖ్యంగా జిలల్లాకేంద్రంలోని గడియారం చౌరస్తా,మార్కెట్‌ రోడ్‌, టీడీగుట్ట జనంతో రద్దీగా మారింది. వాహనాలు పెద్దఎత్తున రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. పలు దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. అసలే సెలవులు కావడంతో విద్యార్థులు క్రీడలపై ఎక్కువగా దృష్ఠి సారిస్తున్నారు. స్పోర్ట్స్‌ దుకాణం తెరవడంతో క్యారమ్స్‌, షెటిల్‌బ్యాట్‌, కాక్స్‌, వాలీబాల్‌, చిల్డ్రన్‌ గేమ్స్‌ కొనడానికి జనం ఎగబడటంతో స్పోర్ట్స్‌ దుకాణాల్లో సందడడి నెలకొంది. 

Updated Date - 2020-05-11T10:53:34+05:30 IST