పెళ్లి ఇంట బంగారం చోరీ

ABN , First Publish Date - 2020-12-20T04:28:16+05:30 IST

పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదు పెద్దమొత్తంలో చోరీకి గురైన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.

పెళ్లి ఇంట బంగారం చోరీ
సంఘటన స్థలంలో ఎస్పీ రెమారాజేశ్వరి

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి


మిడ్జిల్‌, డిసెంబరు 19 : పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదు పెద్దమొత్తంలో చోరీకి గురైన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి ఇంద్రారెడ్డి కుమారుడు తిలక్‌రెడ్డి వివాహం ఈనెల 23న జరపాలని నిశ్చయించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎప్పటిలాగే అందరూ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున 2గంటల నుంచి 4గంటల మధ్య ఇంటి పక్కన ఉన్న కిటికీ నుంచి తలుపునకు ఏర్పాటుచేసిన గడియను తీసి ఇంట్లోకి వచ్చి కప్‌బోర్డులో ఉన్న సుమారు రూ. 42 లక్షల విలువ గల 84 తులాల బంగారుతో పాటు రూ.7.3 లక్షల నగదును అపహరించుకొని వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బాధిత కుటుంబీకులు నిద్రలోంచిలేచి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించారు. కాగా ఇంటి పక్కన ఉన్నవారు రాత్రి 2గంటల ప్రాంతంలో హార్వెస్టర్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తాము గమనించామని, హార్వెస్టర్‌ డ్రైవర్లు అనుకున్నట్లు పోలీసులకు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎస్సై సురేష్‌కు సింగిరెడ్డి తిలక్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీధర్‌ మీడియాతో మాట్లాడుతూ చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తామని, ఇటీవల జైలు నుంచి విడుదలైన పాతనేరస్తుల జాబితా తీసుకొని విచారిస్తామని తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రెమారాజేశ్వరి పరిశీలించారు.


నకిలీ బంగారం విక్రయ ముఠా రిమాండ్‌

నారాయణపేట: నకిలీ బంగారం విక్రయ ము ఠా కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.8 లక్షల నగదు, ఓ సెల్‌ఫోన్‌, రెండు బం గారు నాణేలతో పాటు 250 గ్రాముల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకు న్నారు. నిందితులను శనివారం రిమాం డ్‌కు తరలించిన్నట్లు ఎస్పీ డా.చేతన తెలిపారు. ఈ సందర్భంగా కేసు వివరా లను తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన షేక్‌ అంజద్‌, శ్రీపాద్‌, నవీన్‌ గతంలో నకిలీ బంగారం విక్రయ ముఠా కు రూ. 10 లక్షలు ఇచ్చి మోసపోయారు. తాజా గా మరో వ్యక్తి రణధీర్‌కు నకిలీ బంగా రం విక్రయ ముఠా నుంచి ఫోన్‌కాల్‌ వ చ్చింది. రణధీర్‌కు ఇదివరకు మోసపో యిన అంజద్‌ గుర్తుకు వచ్చాడు. వీరిద్ద రికి వచ్చిన ఫోన్‌కాల్‌ నంబర్లు ఒకే మా దిరిగా ఉండడంతో నారాయణపేట పోలీ స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారం భించారు. కర్ణాటక రాష్ట్రం  బళ్లారి జిల్లా హర్పన్నహల్లి, బాగలి గ్రామాలకు చెం దిన గుజ్జల మల్లికార్జున్‌, అంజప్ప, లక్క ప్పలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, సెల్‌ఫోన్‌, నకిలీ బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్‌ఐ చంద్రమోహన్‌, ఏఎస్‌ఐ సురేందర్‌, పీసీలు అబ్దుల్లా, నరేందర్‌, ఆంజనేయులు, సోమశేఖర్‌, హోంగార్డు హన్మంతులను ఎస్పీ అభినందించారు.

Read more