పెళ్లిలో ఫ్లెక్సీ చిచ్చు

ABN , First Publish Date - 2020-12-14T03:54:20+05:30 IST

పెళ్లిలో ఏర్పా టు చేసిన ఓ ఫ్లెక్సీ రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఏకంగా కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.

పెళ్లిలో ఫ్లెక్సీ చిచ్చు

- రెండు గ్రామాల మధ్య ఘర్షణ

 - పలువురికి గాయాలు

-ఇరువర్గాలపై కేసు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 13: పెళ్లిలో ఏర్పా టు చేసిన ఓ ఫ్లెక్సీ రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఏకంగా కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.  ఈ ఘర్షణలో పలువురికి దెబ్బలు తగలగా ఇరు గ్రామాలకు చెందిన  పలువురిపై కేసులు నమోద య్యాయి. మహబూబ్‌నగర్‌ మండలం ఓబ్లాయిపల్లి తండాలో రెండ్రోజుల క్రితం నర్వ మండలం కన్మ నూర్‌కు చెందిన అమ్మాయి పెళ్లి జరిగింది. పెళ్లికి  సంబంధించిన ఫ్లెక్సీని ఓబ్లాయిపల్లి తండా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని కన్మపూర్‌కు చెందిన వారు చించేశారని  ఓ బ్లాయిపల్లి తండాకు చెందినవారు గొడవపడ్డారు. కన్మూనూర్‌కు చెందినవారిపై దాడి చేశారు. పెళ్లి త రువాత ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. అయి తే తమను కొట్టడాన్ని అవమానంగా భావించిన క న్మపూర్‌కు చెందిన పదిమంది ఆదివారం ఉదయం ఓబ్లాయిపల్లి తండాకు వెళ్లి ఓ ఇంటిపై దాడిచేశారు. ఆడ, మగ అని తేడా లేకుండా కొట్టారు. వెంటనే తే రుకున్న తండావాసులు ఎదురుదాడి చేశారు. పది మంది వరకు గాయాలయ్యాయి. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటన స్థలం చేరుకుని ఇరువ ర్గాలకు శాంతపరిచారు. సీఐ మహేశ్వర్‌, ఎస్సై రమే శ్‌లు గ్రామస్థులతో మాట్లాడి నచ్చజెప్పారు. క్షతగా త్రులను అంబులెన్స్‌లో జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పదిమందివరకు ఈ గొడవల్లో గాయపడ్డారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 ఇరుగ్రామాలకు చెందిన 10 మందిపై కేసు

ఓబ్లాయిపల్లితండాలో జరిగిన ఇరుగ్రామాల గొడ వలో ఇరు గ్రామాలకు చెందిన బాధితులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదుచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓబ్లాయిపల్లితండాకు  చెందిన ఐదుగురిపై, కన్మనూర్‌(గాజులయతండా) కు చెందిన ఐదుమందిపై కేసు నమోదు అయింది. పెళ్లిలో జరిగిన గొడవపై ఆదివారం సర్పంచ్‌ ఆధ్వ ర్యంలో పంచాయితీ జరగాల్సి ఉండగా ముందే ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడిచేసుకున్నాయి. కాగా కన్మనూర్‌ గ్రామస్థులతో తమపై సర్పంచ్‌ భర్త ఉద్దే శపూర్వకంగానే దాడిచేయించారని ఓబ్లాయిపల్లితం డా బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2020-12-14T03:54:20+05:30 IST