అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2020-12-26T03:36:27+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

- ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

    రాజోలి, డిసెంబరు 25 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. మండలంలోని పచ్చర్లలో శుక్రవారం నిర్వహించిన అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపు తోందన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, తిరుమల్‌రెడ్డి, వడ్డేపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T03:36:27+05:30 IST