హంస వాహనంపై విహరించిన వేంకటేశ్వరుడు

ABN , First Publish Date - 2020-12-30T03:36:18+05:30 IST

లక్ష్మీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

హంస వాహనంపై విహరించిన వేంకటేశ్వరుడు
దేవుని కోనేరులో హంస వాహనంపై విహరిస్తున్న స్వామివారు

- మల్దకల్‌లో వైభవంగా తెప్పోత్సవం

- కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

    మల్దకల్‌, డిసెంబరు 29: లక్ష్మీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారు శేషవాహనంపై ఊరేగింపుగా దేవుని కోనేరుకు చేరుకున్నారు. ఆ తర్వాత సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు కోనేరులో విహరించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై ఊరేగించారు. గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి, ఎస్పీ రతన్‌ రంజిత్‌ కుమార్‌ ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  స్వామి వారి కల్యాణాన్ని  సోమవారం రాత్రి  కన్నుల పండువగా నిర్వహించారు.

Updated Date - 2020-12-30T03:36:18+05:30 IST