మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-22T04:07:49+05:30 IST

మండలంలోని బోమ్మరాజుపల్లి గ్రామా నికి చెందిన మహిళా రైతు చంద్ర కళ తహసీల్దార్‌ కార్యాలయ ఆవర ణలో శనివారం ఆత్మహత్యాయ త్నం చేయడం కలకలం రేపింది.

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న మహిళా రైతును అడ్డుకుంటున్న పోలీసులు

- తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన

ఊర్కొండ, నవంబరు 21: మండలంలోని బోమ్మరాజుపల్లి గ్రామా నికి చెందిన మహిళా రైతు చంద్ర కళ తహసీల్దార్‌ కార్యాలయ ఆవర ణలో శనివారం ఆత్మహత్యాయ త్నం చేయడం కలకలం రేపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లిదండ్రులు బోమ్మరాజుప ల్లి శివారులో సర్వే నంబరు 43లో ఎ.2-00 భూమి తన పేర గతంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అదే సర్వే నంబరులో తన తల్లిదండ్రులకు భూమి ఉంది. అందులో నుంచి తన సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌కు చెందిన వారికి రెండు ఎకరాలు అమ్ముకున్నాడు. రిజిస్ట్రేషన్‌ సమయంలో హద్దుల లోపాల వల్ల తనకు చెందిన భూమిపై హై దరాబాద్‌కు చెందిన వారు వస్తుండటంతో కల్వకుర్తి కోర్టులో కేసు వేసి స్టే ఆర్డర్‌ తీసుకోవడం జరిగింది. కేసు ఉన్న వివరాలను సైతం తహసీల్దార్‌ కార్యాయలంలో అప్పగించాం. అట్టి భూ మిపై కేసు నడుస్తుండటంతో హైదరాబాద్‌కు చెందిన వారు  ఇతరులకు శుక్రవారం రిజిస్ట్రేష న్‌ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయంపై అడుగడానికి వెళ్లగా తహసీల్దార్‌ బీష్వానాయక్‌ దురుసుగా ప్రవర్తించడంతో పాటు, అసభ్యసదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపం చెంది కార్యాలయ ఆవరణలో  పెట్రోల్‌ను మీద పోసుకుంటుండగా పో లీసులు ఆమె నుంచి పెట్రోల్‌ డబ్బాను లాగేసుకున్నారు. దీంతో గందరగోళం నెలకొనగా కల్వ కుర్తి సీఐ ఆవుల సైదులు, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్‌ చంద్రకళ కుటుంబ సభ్యులను స ముదాయించారు. తహసీల్దార్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్‌ బీష్వానాయక్‌ తన విధులకు ఆటంకం కలిగించారని, కులం పేరుతో దూషించారని పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో వెల్లడైన అంశాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.


Read more