మహిళలకు అండగా సఖి కేంద్రం
ABN , First Publish Date - 2020-12-06T03:46:07+05:30 IST
మహిళలకు అండగా సఖి కేంద్రం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శ ర్మన్ అన్నారు.

- జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహిళలకు అండగా సఖి కేంద్రం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శ ర్మన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దేశిటిక్యాల సమీపంలో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 48లక్షల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న సఖి సెంటర్ ను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎస్పీలు శంకుస్థాపన చే శారు. ఈ సెంటర్‌లో వైద్య, న్యాయ సేవలకు సంబంధించి 14మంది సిబ్బందిని పూర్తి శిక్షణతో నియమించామని, వారు 24గంటల పాటు సేవలను అందిస్తారని కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ ప్రజ్వల, మునిసిపల్ చైర్‌పర్సన్ కల్పన, డీ ఎస్పీ మోహన్‌రెడ్డి, సీఐ గాంధీనాయక్, చైల్డ్‌వెల్ఫేర్ ప్రొటెక్షన్ సభ్యులు ఇంతియాజ్, వైస్ చైర్మన్ బాబురాఉ, జడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీపీ నర్సింహారెడ్డి, ఈఈ దామోదర్‌రావు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు లక్ష్మణ్‌రావు, కౌన్సిలర్లు, సీడీపీవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.