కరోనా అలర్ట్‌

ABN , First Publish Date - 2020-03-19T06:14:35+05:30 IST

కరోనా వ్యాప్తి చెందుతుండటంతో మాస్క్‌ల వినియోగం పెరుగు తోంది. కొన్ని శాఖల్లో మాస్క్‌లు ఇంకా అవసరం ఉన్నాయి. మునిసిపాలిటీలలో శాని టేషన్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది మాస్క్‌లు లేకుండానే

కరోనా అలర్ట్‌

మహబూబ్‌నగర్‌, మార్చి18: కరోనా వైరస్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు వాల్‌ పోస్టర్లు అతికిస్తోంది. శాని టైజర్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తోంది. నవాబ్‌పేట మండలం చాకల్‌పల్లి గ్రామంలో మహిళా సర్పంచ్‌ రాములమ్మశేఖర్‌ ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి, కరోనా జాత్రత్తలపై అవగాహన కల్పించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గింది. ఇది పెళ్ళిళ్ల సీజన్‌ అయినా సందడి కనిపించడం లేదు.


క్వారంటైన్‌  కేంద్రాల ఏర్పాటు: కరోనా అనుమానిత కేసులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని పరీక్షించేందుకు క్వారంటైన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. జనరల్‌ ఆస్పత్రిలో ఇప్పటికే  ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన 27 మందికి ఇక్కడ చికిత్స నిర్వహిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ, భగీరథ కాలనీ జెపీఎన్‌ఈసీలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెపీఎన్‌ఈసీ కేంద్రాన్ని కలెక్టర్‌ వెంకట్రావ్‌ ఈ కేంద్రాన్ని బుదవారం సందర్శించారు. అయితే భగీరథ కాలనీలోని జెపీఎన్‌సీఈలో వార్డు ఏర్పాటుపై స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేయ వద్దని, రోగులను తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేయడం వల్ల తమకూ వైరస్‌ సోకుంతుందని అన్నారు. రూరల్‌ సీఐ మహేశ్వర్‌, ఎస్సై రమేశ్‌ ఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి, ఆందోళనను విరమింపజేశారు.

 

అన్నీ బంద్‌: జనం ఎక్కువగా ఉండే మైదానాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, థియేటర్లు, పార్కులు, బార్లు బంద్‌ చేయించారు. షాపింగ్‌ మాల్స్‌లోనూ జనం తగ్గిపోయారు. ప్రయాణాలు చాలా వరకు తగ్గించు కున్నారు. పాలమూరులో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. సెలవులు ఉన్నా విహార యాత్రలు, దేవాలయాలకు రద్దీ తగ్గింది.


బస్సుల్లో క్లీనింగ్‌: పాలమూరు డిపో బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రయాణికులు పట్టుకునే హ్యాండిల్స్‌, సపోర్ట్‌ రాడ్స్‌కు స్ర్పే చేయి స్తున్నారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల బస్టాండ్‌లలో క్లీనింగ్‌ కోసం సిబ్బందిని నియమించారు. హైదరా బాద్‌, తాండూర్‌ రూట్లకు ప్రయాణికులు తగ్గారు. 


మాస్క్‌లు కావాలి: కరోనా వ్యాప్తి చెందుతుండటంతో మాస్క్‌ల వినియోగం పెరుగు తోంది. కొన్ని శాఖల్లో మాస్క్‌లు ఇంకా అవసరం ఉన్నాయి. మునిసిపాలిటీలలో శాని టేషన్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది మాస్క్‌లు లేకుండానే మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. కొందరు వినియోగి స్తున్నా మరికొందరు మాస్క్‌లు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించే చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల వ్యాధిని నివారించగలుగుతామని ప్రచారం చేపడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, జనావాస ప్రాంతాలలో జాగ్రత్తలపై క రపత్రాలను అతికిస్తున్నారు. 


చికెన్‌ ధర ఢమాల్‌.. మటన్‌కు పెరిగిన ధర: చికెన్‌ ధర రోజు రోజుకు పడిపోతుండగా మటన్‌ ధర మాత్రం అమాంతం పెంచేశారు. పెళ్ళిళ్లలోనూ చికెన్‌ వంటకాలు తగ్గాయి. మటన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. చికెన్‌ ధర కిలోకు రూ.40 నుంచి రూ.50కి పడిపోగా, మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. మటన్‌ కిలో ధర జిల్లా కేంద్రంలో ఇదివరకు రూ.560 ఉండగా, ఇప్పుడు రూ.600కు పెంచేశారు. హన్వాడలో రూ.500 ఉండగా రూ.540కి పెంచారు.

Updated Date - 2020-03-19T06:14:35+05:30 IST