జూరాల ప్రాజెక్టుకు మళ్లీ కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-12T12:44:38+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతోంది.

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ కొనసాగుతున్న వరద

మహబూబ్‌నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 55,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 62,949 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 9.296 టీఎంసీలకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను... ప్రస్తుత నీటి మట్టం 318.340 మీటర్లుగా నమోదు అయ్యింది. 


Updated Date - 2020-10-12T12:44:38+05:30 IST