భర్త కలను నిజం చేశా...!

ABN , First Publish Date - 2020-03-07T06:07:19+05:30 IST

చదువుకోవడానికి పెద్దగా స్కోప్‌ లేని పరిస్థితులు.. అయినా వెన్నుతట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులు.. చిన్నతనంలోనే వివాహం జరిగినా వెన్నుతట్టి ప్రోత్సహించిన భర్త.. ప్రజసేవలో పడిపోయి సమయం కేటాయించలేకపోయినా..

భర్త కలను నిజం చేశా...!

  • ఆయన సహకారంతోనే ఎంపీఓ నుంచి కలెక్టర్‌గా ప్రయాణం
  • తల్లిదండ్రులు ప్రోత్సాహం.. పిల్లల తోడ్పాటు కూడా కారణమే..
  • నాన్న ఆర్మీలో పనిచేయడం వల్ల ప్రజాసేవపై మక్కువ ఏర్పడింది
  • వృత్తిగత జీవితంలో సహకరించిన వారు ఎంతోమంది ఉన్నారు..
  • ప్రతీ పదవిని.. హోదానుఅవకాశంగా మాల్చుకుంటూ ఈ స్థాయికి..
  • 17 మంది బాండెడ్‌ లేబర్‌ పిల్లలను కాపడటం మర్చిపోలేని అంశం
  • చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి
  • అజమాయిషీ చేసి పనిచేయించేకంటే అధికారుల్లో బాధ్యత పెంచాలి
  • ఆత్మసాక్షిగా మనమేమేం చేస్తున్నామనేది.. మనకు తెలిసి ఉండాలి
  • ఆంధ్రజ్యోతితో జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాష లైఫ్‌ జర్నీ...


చదువుకోవడానికి పెద్దగా స్కోప్‌ లేని పరిస్థితులు.. అయినా వెన్నుతట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులు.. చిన్నతనంలోనే వివాహం జరిగినా వెన్నుతట్టి ప్రోత్సహించిన భర్త.. ప్రజసేవలో పడిపోయి సమయం కేటాయించలేకపోయినా.. తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని తోడ్పాటునందించిన పిల్లలు.. చిన్న ఉద్యోగంతో ప్రారంభమైన ఆమె జర్నీ.. ఇప్పుడు జిల్లాను శాసించే పరిపాలనాధికారి వద్దకు చేరింది. ఎత్తుపల్లాలు, నిత్యం ఒత్తిడి, వివిధ హోదాల్లో పనులు చేసినా.. ఏనాడు ఆమె ఓర్పును కోల్పోలేదు. చేపట్టిన పదవులన్నింటికీ తనదైన శైలీలోనే వన్నె తెచ్చారు. ఇచ్చిన ఏ టాస్క్‌ అయినా విజయవంతం చేసేవరకు వదలని పనివిధానం తనది.. అందుకే వృత్తిగత జీవితంలో ఎందరో మన్ననలు పొందారమే.. సీనియారిటీలో దిగువలో ఉన్నా.. తక్కువ సమయంలోనే జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టారు.


ప్రతీ పదవినీ.. హోదాను ఒక అవకాశంగా మలుచుకుని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు.. ఆమె ఎవరో కాదు.. వనపర్తి జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా.. జీవితంలో తక్కువ సమయంలో ఆమె ఎదుర్కొన్నన్ని సవాళ్లు మరెవరూ ఎదురుకోలేదంటే అతిశయోక్తి చెందరేమో.. జిల్లా కలెక్టర్‌గా ఆమె వనపర్తి జిల్లాలో నెలరోజులు పూర్తయిన సందర్భంగా ఆమెను ఆంధ్రజ్యోతి సంప్రదించింది. తన లైఫ్‌ జర్నీని మనతో పంచుకున్నారు. ఐఏఎస్‌ కావాలనుకున్న తన భర్త కళను తాను నెరవేర్చడం.. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయక.. ఈ స్థాయికి చేరడంపై పలు విషయాలు ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే..


తల్లిదండ్రుల ప్రోత్సాహం..:

మా నాన్న షేక్‌ యూసఫ్‌ భాష... అమ్మ షేక్‌ షబీర్‌ అలీయూసఫ్‌. వారికి నలుగురం ఆడపిల్లలమే. నేను అందరికన్నా పెద్ద. నాన్న ఆర్మీలో పనిచేసేవారు.. ఈ కారణంగా మేము పలు రాష్ర్టాల్లో ఉండి మా విద్యాభ్యాసం కొనసాగించాం. చదువుకోవడానికి పెద్దగా స్కోప్‌ లేని పరిస్థితుల్లో కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు. చదువు విలువ తెలిసిన ఫ్యామిలీలో పుట్టడం, అమ్మకు కూడా తొందరగా వివాహం కావడంతో పదో తరగతి వరకే చదివింది. ఆ కారణంగా ఆమెకు మమ్మల్ని బాగా చదివించాలనే కోరిక ఉండేది. అప్పట్లో మిలటరీలో తక్కువ జీతం ఉన్నప్పటికీ మేం ఏం చదవాలనుకున్నా అమ్మానాన్న ప్రోత్సహించేవారు.. అందుకే ఇప్పుడు అందరం సెటిల్‌ అయ్యాం. మొదటి చెల్లెలు షేక్‌ నాజ్నిన్‌ భాష విదేశాల్లో స్థిరపడ్డారు.


రెండో చెల్లెలు షేక్‌ పర్వీన్‌ భాష టీసీఎస్‌లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా చేస్తున్నారు. చిన్నవయసులో ఆస్థాయికి వచ్చిన వ్యక్తి తను.. మూడో చెల్లెలు హోమ్‌మేకర్‌గా ఉంటున్నారు. నాకు గ్రాడ్యుయేషన్‌ పూర్తికావడంతోనే వివాహం చేశారు. చిత్తూరు జిల్లా చ ంద్రగిరి మండలానికి చెందిన షేక్‌ ఇమామ్‌ ఉస్సేన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఇక్కడ జీవితంలో ఎలా సెటిల్‌ కావాలనే ఆలోచన ఉండేది. కేరిర్‌పై భయం వేసింది. 


నా వెన్నంటే ఉన్నారు...:

సాధారణంగా మహిళలు పెళ్లైన తర్వాత అదే జీవితం అనుకుని బతుకుతారు.. చదువుకున్నా ఉద్యోగం చేయడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే నాకు నా భర్త ఇమామ్‌ హుస్సేన్‌ నుంచి పూర్తి సహకారం దొరికింది. కుటుంబ కారణాల వల్ల ఆయన ఐఏఎస్‌ కావాలనుకుని కాలేకపోయారు. కానీ నేను ఏరోజైనా కలెక్టర్‌ కావాలని తాపత్రయపడేవారు. నేను చేపట్టిన అన్ని ఉద్యోగాల్లో నేను కలెక్టర్‌ కావాలనుకునే నా భర్త కళను నేనూ కన్నాను. ఎన్ని చాలెంజెస్‌ వచ్చినా ఆయన సహకారంతో ఎదిగాను. ప్రస్తుతం ఆయన కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నారు.


భార్య వెన్నుతట్టి ప్రోత్సహించే భర్తలు అందరికీ దొరకాలి. అప్పుడే ఉన్నత ఉద్యోగాలు మహిళలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగ జీవితంలో కుటుంబానికి సమయం తక్కువగా కకేటాయించాల్సి వస్తోంది. కానీ నా పిల్లలు కూడా నాకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. నా వృత్తిని అర్థం చేసుకుని మెలుగుతున్నారు. నా తల్లిదండ్రులు నా బాధ్యతతోపాటు పిల్లల బాధ్యతను కూడడా తతీసుకున్నారు. నాకు ఒక బాబు, పాప. బాబు అజ్మల్‌ హుస్సేన్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పాప ఫాతిమా ఎనిమిదో తరగతి చదువుతోంది. 


ఎంపీఓ నుంచి కెరీర్‌ ప్రారంభం...:

2003లో నేను గ్రూప్‌-1 పరీక్ష రాశాను.. 2007లో దాని ఫలితాలు వచ్చాయి.. అప్పుడు నాకు ఒక సంవత్సరం పాటు శిక్షణ మొత్తం మెదక్‌ జిల్లాలోనే జరిగింది. 2008లో అదే జిల్లాలో హత్నూరా మండలానికి సంవత్సరంపాటు ఎంపీడీఓగా చేశశారు. వెంటనే డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు నోటిఫికేషన్‌ వచ్చింది. అందులో కూడా ఉత్తీర్ణత సాధించి.. డిప్యూటీ కలెక్టర్‌ శిక్షణ కూడా వమెదక్‌ జిల్లాలోనే జరిగింది. అప్పుడు మొదటి పోస్టింగ్‌ 2011లో ఎఫ్‌ఎస్‌ఓ (ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ అధికారి)గా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోస్టింగ్‌ వచ్చింది. పురుషోత్తం రెడ్డి, గిరిజాశంకర్‌ కలెక్టర్లుగా ఉన్నప్పుడు నేను వివిధ హోదాల్లో ఉమ్మడి జిల్లాలో పనిచేశాను.


డీపీఓ, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓగా, మొట్టమొదటి మీసేవా కో అర్డినేటర్‌గా, డీఆర్‌ఓగా పనిచేశాను. నాకు రెవెన్యూ పోస్టింగ్‌ కాకుండా వివిధ పోస్టులు వచ్చాయని అందరూ అన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని శాఖలపై పట్టు సాధించగలిగాను. కలెక్టర్లుగగా పనిచేసిన పురుషోత్తంరెడ్డి, గిరిజాశంకర్‌, చిరంజీవి, ఇప్పుడు వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌గా ఉన్న హరిత.. వీరందరూ నా వృత్తిగత జీవితంలో ఎంతో సహకరించారు. ఆ తర్వాత నేను మెదక్‌ సర్వశిక్షఅభియాన్‌ (అప్పట్లో ఆర్‌వీఎం) పీఓగా పనిచేస్తానని అడిగాను. నేను కోరుకున్న వెంటనే అప్పుడు మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్‌, కమిషనర్‌గా ఉన్న పూనం మాలకొండయ్య, ఎస్‌పీడీగా ఉషారాణి నాకు ఒకే రోజులో పోస్టింగ్‌ ఇచ్చారు. పేపర్‌ వర్క్‌ అంతా కంప్లీట్‌ చేసి.. అదే రోజు విధుల్లో చేరిపోయాను.


ఒక్క రోజులో అంత స్పీడ్‌గా నా విషయంలో పని జరిగిపోయింది. పీఓ ఎస్‌ఎస్‌ఏగా ఉన్నప్పటటికీ 2014 ఎన్నికల్లో సంగారెడ్డి రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా నాకు స్మితా సబర్వాల్‌ అవకాశం ఇవ్వడంతో ఎన్నికల విధులు కూడా సమర్థవంతంగా నిర్వహించాను. తర్వాత కలెక్టర్‌గా వచ్చిన రోనాల్డ్‌రోస్‌ కూడా విధి నిర్వహణలో ఎంతో సహకరించారు. చాలా మంచి కార్యక్రమాలు వారి సహకారంతో విజయవంతం చేయగలిగాం. అప్పట్లో స్కూల్‌ టాయిలెట్స్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు వేశశారు. దాంతో మేము చాలా సీరియస్‌గా తీసుకుని అన్ని పాఠశాలల్లో పంక్షనింగ్‌ టాయిలెట్స్‌ను నిర్మించాం. అది ప్రధానమంత్రి అవార్డుల వరకూ వెళ్లింది. అలాగే మెదక్‌లో ఉన్నప్పుడు కేజీవీబీలను బాగా డెవలప్‌ చేశాం.


బహుశా ఇన్ని శాఖల్లో అనుభవం సాధించడం మూలాన కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నాకు సీనియారిటీలో దిగువన ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. వృత్తిగత జీవితంలో పొలిటికల్‌ సహకారం కూడడా చాలా అవసరం. నాకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు దగ్గర నుంచి మంచి సహకారం లభించింది. ఇప్పుడు మంత్రి నిరంజన్‌రెడ్డి గారి సహకారం కూడా బాగుంది.

 

సిరిసిల్లను ఛాలెంజ్‌గా తీసుకున్నా...:

నాపై నమ్మకం ఉంచి.. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఇక్కడకు వచ్చేవరకు పనిచేశాను. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన మైన అనంతగిరి రిజర్వాయర్‌, భూసేకరణ, మిడ్‌మానేరు పూర్తి, ముంపు గ్రామాలను ఖాళీచేయించడం అది వారిని ఒప్పించడం. కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్‌మానేరులో ప్రస్తుతం 25 టీఎంసీల వరకు నీళ్లు నింపడం జీవితంలో మరిచిపోలేని అంశాలు.


అలాగే మంత్రి కేటీఆర్‌ సహకారంతో సిరిసిల్ల జిల్లా రోడ్ల విస్తరణ పూర్తిచేసి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలాంటి కార్యక్రమాలు చేశాం. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సహకారంతో జిల్లాలో అధికారులపై కేవలం అజమాయిషీ కాకుండా వారిలో బాధ్యత పెరిగేలా చేశాం. భయం ఉంటే మనం ఉన్నంత సేపు బాగానే చేస్తారు.. కానీ ఫలితాలు సానుకూలంగా ఉండవు. అందుకే మేము బాధ్యత పెంచాం. సిరిసిల్ల మోడల్‌నే వనపర్తిలో కూడడా అమలు చేస్తాం. 


ప్రజలకు చేరువ కోసమే చిన్నజిల్లాలు...:

ప్రభుత్వం అధికారులు ప్రజలకు దగ్గర్లో ఉండి సేవ చేసేందుకే చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా పెరిగాయి. పనులు త్వరగా జరిగిపోవాలని, అభివృద్ధి వేగంగా చేయాలని కోరుకుంటున్నారు. కానీ వారి ఆశలను అందుకోవడం అధికారులు సఫలీకృతం కాలేకపోతున్నారు. మేము 64 మండలాలతో కూడిన పెద్ద జిల్లాల్లోనే ప్రజలకు పనులు జరగడం కోసం వేగంగా పనిచేశాం. ఇప్పుడు సాధ్యం కాదని అనుకోవడం సరికాదు. అయితే అధికారులు చాలా బాధ్యత, ప్రణాళికబద్ధంగా పనిచేయాలి.


అధికారులను బాగుచేయడంలో చాలా ఛాలెంజెస్‌ ఉన్నాయి. వాటిని త్వరలోనే అధిగమించి ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. సిరిసిల్ల వెళ్లినప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇక్కడ కూడా వస్తుంది. అధికారులంతా ఏం చేస్తున్నారో.. ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారా లేదా అనేది ఎవరూ నిర్ణయించాల్సిన అవసరం లేదు. వారి పనిపై వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతీ ఛాలెంజ్‌ను ఒక అవకాశంగా తీసుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. 


17మంది పిల్లలను రక్షించడం మర్చిపోలేని విషయం...:

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పనిచేసినప్పుడు మున్ననూరు దగ్గర చిన్నపిల్లలను బాండెడ్‌ లేబర్‌గా పనిచేయించుకున్నారనే విషయం తెలిసింది. అప్పుడు కలెక్టర్‌గా ఉన్న గిరిజాశంకర్‌.. నేను లీవ్‌ కోసం అప్లికేషన్‌ పెడితే.. మీరు ఇవ్వాల ఉండాల్సిందే. ఒక స్ర్టింగ్‌ అపరేషన్‌ చేయాల్సిందేనని చెప్పారు. ఆ పిల్లలను పనిచేయించేది ఒక మాఫియా. అధికారులు వస్తున్నట్లు తెలిస్తే వారిని అక్కడ ఉండనివ్వరు. అందుకే స్ర్టింగ్‌ ఆపరేషన్‌ చేశాం. రాత్రి మూడు గంటల వరకు అక్కడకు చేరుకుని.. నాటుపడవల ద్వారా వారు ఉండే ప్రదేశానికి వెళ్లి తెల్లవవారే సరికి 17 మంది పిల్లలను రక్షించాం. అప్పుడు కలెక్టర్‌ ఒక మాట అన్నారు.. నీ పిల్లల్లాగా మరో 17 మంది పిల్లలను నీవు రక్షించుకున్నావ్‌ అని.. ఆ మాటలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. 


వనపర్తి ప్రజలు చాలా సాఫ్ట్‌...:

కలెక్టర్‌గా వనపర్తిలో బాధ్యతలు చేపట్టి నెలరోజులు అవుతుంది. సిరిసిల్లకు ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా సాఫ్ట్‌గగా ఉన్నారు. ప్రాంత స్వభావం కారణంగా అలా ఉండి ఉంటారు. అధికారుల నుంచి వారికి ఏం కావాలో స్పష్టమైన అభిప్రాయం వారికి ఉంది. కేవలం అధికారులు వారితో కలిసి మెలగడం, నడవడం నేర్చుకోవాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సిరిసిల్లను మోడల్‌గా తీసుకుని ఇక్కడ కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తాం. ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం. అధికారయంత్రాంగాన్ని కూడా వారికి అందుబాటులోకి తెస్తాం.

Updated Date - 2020-03-07T06:07:19+05:30 IST