లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలి: ఎస్‌వీఈపీ ప్రాజెక్టు ఢిల్లీ ప్రతినిధి రాజీవ్‌ సింఘాల్‌

ABN , First Publish Date - 2020-03-18T11:17:37+05:30 IST

ఎస్‌వీఈపీలో (స్టార్టప్‌ విలేజ్‌ ఎంటర్‌ ప్రెన్యూవర్‌షిప్‌) రుణాలు పొంది లబ్ధిపొందుతున్న సభ్యులకు ...

లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలి: ఎస్‌వీఈపీ ప్రాజెక్టు ఢిల్లీ ప్రతినిధి రాజీవ్‌ సింఘాల్‌

తాడూరు, మార్చి 17 : ఎస్‌వీఈపీలో (స్టార్టప్‌ విలేజ్‌ ఎంటర్‌ ప్రెన్యూవర్‌షిప్‌) రుణాలు పొంది లబ్ధిపొందుతున్న సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలందించాల్సిందిగా ఢిల్లీ ప్రతినిధి రాజీవ్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యను ఎస్‌వీఈపీ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి మండలంలో ఎంత మంది మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తున్నారనే విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. అనంతరం ఎస్‌వీఈపీ పథకం ద్వారా రుణం పొంది స్వయం ఉపాధి పొందుతున్న పలువురు సభ్యుల వ్యాపారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎస్‌వీఈపీ లబ్ధిదారులు పొందుతున్న స్వయం ఉపాధి సంతృప్తికరంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌వీఈపీ ప్రాజెక్టు మేనేజర్‌ శ్రవణ్‌కుమార్‌, నాన్‌ఫామ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ లక్ష్మీనారాయణ, డీపీఎం నర్సింహులు, ఏపీఎం ఈశ్వర్‌, సీసీలు లక్ష్మణ్‌, పద్మజ, పార్వతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T11:17:37+05:30 IST