ముగిసిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-18T11:12:33+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిసాయి. చివరి రోజు రసాయన శాస్త్రం, కామర్స్‌ పరీక్షలకు...

ముగిసిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

  •  జిల్లా వ్యాప్తంగా 238 మంది గైర్హాజరు 

గద్వాల టౌన్‌, మార్చి 17 : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిసాయి. చివరి రోజు రసాయన శాస్త్రం, కామర్స్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలలో 238 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 4,450 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 4,212 మంది హజరయ్యారు. వీరిలో సాధారణ పరీక్షలకు 3,828 మందికి గాను 3,633 మంది హజరు కాగా 195 మంది గైర్హాజర య్యారు. వృత్తి విద్యకు సంబంధించి 622 మందికి గాను 579 మంది హజరు కాగా మిగతా 48 మంది గైర్హాజరయ్యారు. 


పరీక్షా కేంద్రాల తనిఖీ

అయిజ : జిల్లా నోడల్‌ అధికారి హృదయ రాజు ఇంటర్‌ పరిక్షా కేంద్రాలను తనఖీ చేశారు. అయిజ పట్టణంలో 3 పరిక్షా కేంద్రాలలో ఇంటర్‌ పరిక్షలు నిర్వహించబడుతున్నాయి. మంగళవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరిక్షలు నిర్వహించబడ్డాయి. 3 పరిక్షా కేంద్రాలలో 1,112 మంది విద్యార్థులు పరిక్ష రాయాల్సి ఉండగ 59 మంది విద్యార్థులు గైర్హాజరు కావటంతో 1,053 మంది విద్యార్థులు పరిక్ష రాయటం జరిగింది. ఈ పరిక్షా కేంద్రాలను జిల్లా నోడల్‌ అధికారి హృదయరాజు, మెంబర్‌ వీరన్నలు పరిశీలించి పర్యవేక్షించారు.

Updated Date - 2020-03-18T11:12:33+05:30 IST