‘ఉపాధి’ నిర్వీర్యానికి కుట్ర

ABN , First Publish Date - 2020-03-18T11:07:16+05:30 IST

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టి ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు...

‘ఉపాధి’ నిర్వీర్యానికి కుట్ర

ఫీల్డ్‌ అసిస్టెంట్ల విమర్శ

ఏడో రోజుకు చేరిన సమ్మె

మద్దతు తెలిపిన అఖిలపక్షం నాయకులు


గద్వాల రూరల్‌, మార్చి 17 : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టి ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు.  ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఏడో రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మధుసూదన్‌, నాగర్‌ దొడ్డి వెంకట్రాములు, అతికుర్‌ రహెమాన్‌ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం సీపీఐ నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. నానా జీఓలు, సర్క్యులర్లను తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్‌, కోశాధికారి శ్రీనివాసులు, మహబూ బ్‌, ఆంజనేయులు, ఊషన్న, విజయభాస్కర్‌రెడ్డి, విజయోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-18T11:07:16+05:30 IST