నర్సరీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-03-08T07:13:31+05:30 IST
హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ సుధాకర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని...

చారకొండ, మార్చి 7 : హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ సుధాకర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని మర్రిపల్లి, సారబండతండా, జూపల్లి గ్రామాల్లో ఆయన నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేజింగ్, కన్వర్షన్ బెడ్స్ టార్గెట్ ప్రకారం ఏర్పాటు చేసి అన్నిట్లో విత్తనాలు నాటి క్రమంతప్పకుండా రోజుకు రెండుసార్లు నీటిని పట్టాలన్నారు. బ్యాగుల్లో నాటిన విత్తనాలు మొలకెత్తక పోతే వాటిని గుర్తించి విత్తనాలను నాటాలన్నారు. మొక్కలకు ఎండ తగులకుండా నీడ కోసం నెట్లను ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కంపోస్టు షెడ్స్ నిర్మాణాలు ఈనెల 31వరకు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయసుధ, సర్పంచ్‌లు నరేష్‌నాయక్, రాజునాయక్, ఏపీవో ఇమామ్ అలీ, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.