విద్యార్థులు కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
ABN , First Publish Date - 2020-03-08T07:12:47+05:30 IST
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్‌పై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. తెలంగాణ ఇన్మర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టిఐటిఏ) ఆధ్వర్యంలో ...

నారాయణపేట క్రైం, మార్చి 7: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్‌పై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. తెలంగాణ ఇన్మర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టిఐటిఏ) ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో 8,9వ తరగతి చదువుతున్న 13,600 మంది విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం,పనితీరు, కంప్యూటర్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కలెక్టర్ హరిచందన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి కంప్యూటర్ విద్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఉన్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందజలో ఉండాలన్నారు. కంప్యూటర్‌లోని అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఈఓ రవీందర్, కేజీబివి ఎస్‌ఓ శ్వేతజ, టిఐటిఏ టెక్నిషియన్స్ సందీప్, సౌమ్య, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.