అలవి వలలు వేస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-03-08T07:06:55+05:30 IST
కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ ఏడీ రాధరోహిణి హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో...

- మత్స్యశాఖ జిల్లా ఏడీ రాధారోహిణి
- అలవి వలలపై ప్రత్యేక నిఘా ఉంచాం
- డీఎస్పీ మోహన్‌రెడ్డి
కొల్లాపూర్, మార్చి 7 : కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ ఏడీ రాధరోహిణి హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిషేధిత అలవి వలలపై మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం లక్షల సంఖ్యలో చేప పిల్లలను కృష్ణానదిలో వదిలితే మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా కొంత మంది అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తున్న ఆంధ్రా దళారులకు తెలంగాణ మత్స్యకారులు సహకరించొద్దన్నారు. డీఎస్పీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అలవి వలలతో చేపల వేట కొనసాగిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిఘా పెంచామని అలవి వలలతో వేట కొనసాగించకుండా గట్టి బందోబస్తు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ కార్యదర్శి సత్యనారాయణ, కొల్లాపూర్ ఎంపీపీ సుధారాణి, పెంట్లవెల్లి మహేశ్వరి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ మురళీగౌడ్, పెంట్లవెల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.