బీసీలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు : యుగంధర్ గౌడ్

ABN , First Publish Date - 2020-03-12T05:51:28+05:30 IST

రాష్ట్రంలో అప్పులను బీసీలపై రు ద్దుతూ, సంపాదన మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెడుతూ బీసీలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని బీసీ సంక్షేమ సంఘం

బీసీలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు : యుగంధర్ గౌడ్

వనపర్తి టౌన్‌, మార్చి 11:రాష్ట్రంలో అప్పులను బీసీలపై రు ద్దుతూ, సంపాదన మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెడుతూ బీసీలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని  బుధవారం బీసీ భవన్‌లో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్ల కాలంలో రెండు లక్షల ఇ రవై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసిదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై 13న రాష్ట్రంలోని అన్ని జిల్లా, డివి జన్‌, మండల కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేప ట్టనున్నామన్నారు. బీసీ యువజన పట్టణ ప్రధానకార్యదర్శి రవి నాయుడు, కొత్తకోట మండలాధ్యక్షుడు అంజన్నయాదవ్‌ ఉన్నారు.  

Updated Date - 2020-03-12T05:51:28+05:30 IST