స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-07-19T07:25:17+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ..

స్వచ్ఛంద లాక్‌డౌన్‌

  • - తీర్మానాలు చేసిన గ్రామాలు

కందనూలు/కొల్లాపూర్‌/అమరచింత/మదనాపురం, జూలై 18 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌, స్వర్ణకార సంఘాల వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ నెల 31 వరకు  బంద్‌ పాటిస్తున్నట్లు ఆయా సంఘాలు సభ్యులు శనివారం మునిసిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే కొల్లాపూర్‌లో శనివారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అమరచింత మునిసిపాలిటీలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు శనివారం తీర్మానం చేశారు. వ్యాపారులు ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచి, అనంతరం బంద్‌ చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే మదనాపురంలో కూడా దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరిచి ఉంచాలని తీర్మానించారు.

Updated Date - 2020-07-19T07:25:17+05:30 IST