కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2020-03-02T11:46:02+05:30 IST

భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాల హక్కుల సాధనకై కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర

కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

  • సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు 
  • భవన  నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమేష్‌ 

ఆత్మకూర్‌: భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాల హక్కుల సాధనకై కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమేష్‌ అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం వనపర్తి జిల్లా రెండో మహాసభల సందర్భంగా ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో జిల్లాలోని భవన  నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాల యం నుంచి ఎంజీ ఫంక్షన్‌ హాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాన కార్మిక సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అధ్యక్షతన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షు డు మాట్లాడుతూ కార్మిక సంఘాల ఉద్యమాల ఫలితంగా 1996లో అప్పటి కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ చట్టాన్ని అమలు చేసిం దని తెలిపారు. అందుకు అనుగుణంగా 2007లో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తం గా సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదయ్యారని తెలిపారు. కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ చట్ట ప్రకా రం కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు నేటికీ అమలు కావడం లేదని విమర్శించారు. మోదీ ప్రభు త్వం అధికారం చేపట్టాక కార్మిక చట్టాలను మరింత నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశభక్తి పేర సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలను అమలు చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప మోదీ ప్రభుత్వం 130 మంది కోట్ల భారతీయులకు చేసిందేమో లేదని ఆరోపించారు. ఉపాధి అవకాశాలు కల్పించడమే దేశ భక్తి అని మోదీ తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. అద్దాల మేడలు కట్టే భవన నిర్మాణ కార్మికులకు కనీసం పక్క ఇళ్లు కూడా లేక అద్దె ఇళ్లలో జీవనం గడుపుతుంటే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని పాలకులు మాటలు చెప్పడమే తప్పా అమలు చేయ డం లేదని మండిపడ్డారు. నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి పెళ్లి కానుక సహజ మరణం, ప్రమాద మరణం, పింఛన్‌, ప్రతి కార్మికుడికి పక్కా ఇళ్లు వంటి పథకాలు అమలు చేసే వరకు కార్మికులు ఐక్య ఉద్య మాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశి వుడు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌ కుమార్‌, ప్రసాద్‌, న్యూడె మోక్రసి నాయకులు హనుమంతు, నాయకులు రాజన్న, సామేల్‌, గీతాబా య్‌, వెంకటేష్‌, ఆయా గ్రామాల కార్మికులు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:46:02+05:30 IST