పల్లెల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడండి

ABN , First Publish Date - 2020-12-30T03:42:46+05:30 IST

పల్లెల అభివృద్ధి ప నులపై సర్పంచులు, కార్యదర్శులు, సంబంధిత ప ర్యవేక్షణ అధికారులు నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లెల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడండి
లింగసానిపల్లిలో సర్పంచ్‌, కార్యదర్శి, ఎంపీఓలపై మండిపడుతున్న కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌

- తీరు మారకుంటే కఠిన చర్యలు  

-  కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ 

- సంబంధిత గ్రామ కార్యదర్శులకు,

   సర్పంచులకు, ఎంపీఓకు నోటీసులు జారీ

బిజినేపల్లి, డిసెంబరు 29 : పల్లెల అభివృద్ధి ప నులపై సర్పంచులు, కార్యదర్శులు, సంబంధిత ప ర్యవేక్షణ అధికారులు నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరి ధిలోని లింగసానిపల్లి, వెల్గోండ, మంగనూర్‌ గ్రా మాలలో మంగళవారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చే శారు. లింగసానిపల్లిలో పారిశుధ్యం, శానిటేషన్‌ ప నులు సరిగ్గా నిర్వహించకపోవడంతో సంబంధిత కార్యదర్శి రాధిక, సర్పంచ్‌ సుగుణమ్మలను  మంద లించారు. హరితహారంలో నాటిన మొక్కలను పూ ర్తిస్థాయిలో సంరక్షించాలని ఆదేశించారు. మంగనూ ర్‌లో గ్రీన్‌ బడ్జెట్‌ రూ.11 లక్షలు ఉన్నా ఖర్చు చే యకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్గోండ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. అనంతరం లిం గసానిపల్లి, వెల్గోండ, మంగనూర్‌ గ్రామాల కార్య దర్శులకు, ఎంపీవో రాములు నాయక్‌కు నోటీసులు జారీ చేయాలని డీపీవో సురేష్‌మోహన్‌ను ఆదేశిం చారు. జనవరి 1లోగా పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని, జనవరి 6న మరోసారి పరిశీలనకు వ స్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు అం జిరెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, అధికారులు ఉన్నారు. 

 సృజనాత్మకతను ఉపాధ్యాయులే గుర్తించాలి

కొల్లాపూర్‌: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులే గుర్తించాలని  కలెక్టర్‌ శర్మన్‌ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో మూలవికాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొ ల్లాపూర్‌, పెంట్లవెల్లి మండలాలకు చెందిన 64 ప్ర భుత్వ పాఠశాలలకు క్రీడా, సైన్స్‌ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై మా ట్లాడారు. విద్య, క్రీడల్లో విద్యార్థులు రాణించేలా ఉ పాధ్యాయులు కృషి చేయాలన్నారు.  దాతల సహ కారంతో మూలవికాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్ర భుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా, సైన్స్‌ సామగ్రి ని అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు.   కలెక్టర్‌ను డీఈవో గోవిందరాజులు, ఎంఈవో టి. చంద్రశేఖర్‌రెడ్డి  శాలువా పూలమాలలతో సన్మా నించారు. కార్యక్రమానికి ఆర్డీవో హనుమానాయక్‌, తహసీల్దార్‌ ఎక్బాల్‌, మూల వికాస్‌ ఫౌండేషన్‌ అ ధ్యక్షులు మండ్ల రవి, నల్లవెల్లి భరత్‌, క్రాంతి కుమార్‌, శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రంగినేని అభి లాష్‌రావు, నరేందర్‌రెడ్డి,  కాటం జంబులయ్య,  సీపీఎం నాయకుడు అశోక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T03:42:46+05:30 IST