-
-
Home » Telangana » Mahbubnagar » law graduats to apply administrative service
-
ఎస్టీ న్యాయ పట్టభద్రులకు శిక్షణ
ABN , First Publish Date - 2020-12-16T04:11:57+05:30 IST
అడ్మినిస్ట్రేట్ ఆఫ్ సర్వీస్ 2020- 21లో శిక్షణ పొందేందుకు గిరిజన న్యాయ పట్టభద్రుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా గిరిజ న అభివృద్ధి అధికారి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నారాయణపేటటౌన్, డిసెంబరు 15 : అడ్మినిస్ట్రేట్ ఆఫ్ సర్వీస్ 2020- 21లో శిక్షణ పొందేందుకు గిరిజన న్యాయ పట్టభద్రుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా గిరిజ న అభివృద్ధి అధికారి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, న్యా యశాస్త్రంలో పట్టభద్రులై ఉండి కుటుంబ వార్షిక ఆదా యం రూ.2 లక్షలకు మించరాదని, శిక్షణ కాలంలో నెలకు వెయ్యి భృతితో పాటు మొదటి సంవత్సరానికి ఫర్నిచర్, పుస్తకాల కొ నుగోలు కోసం రూ.6వేలు చెల్లిస్తారన్నారు. అర్హులు ఈనెల 21లోపు పూర్తి వివరాలతో సంబంధిత కార్యాలయంలో సంప్రదించా లని ఆయన కోరారు.