ఆధునిక పద్ధతులతో లాభాలు

ABN , First Publish Date - 2020-12-16T03:06:15+05:30 IST

ఆధునిక వ్యవసాయ పద్ధతి ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన కళాశాలల కమిషనర్‌ వెంకటరామారెడ్డి అన్నారు.

ఆధునిక పద్ధతులతో లాభాలు
కూరగాయల తోటను పరిశీలిస్తున్న రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకటరామారెడ్డి

 రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకటరామారెడ్డి 

పెద్దమందడి, డిసెంబరు 15: ఆధునిక వ్యవసాయ పద్ధతి ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన కళాశాలల కమిషనర్‌ వెంకటరామారెడ్డి అన్నారు.  మండలంలోని చిన్నమందడిలో  మంగళవారం రైతులకు కూరగాయల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరామారెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల ద్వారా కూరగాయల పంటలు సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు అన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చేలా చూడాలన్నారు.  గ్రామంలో సర్పంచ్‌ సూర్యచంద్రారెడ్డి చేపట్టిన ఆధునిక వ్యవసాయం అభినందనీయమన్నారు. ఉద్యాన కళాశాల డీన్‌ గిర్వాణి,   నాగరాజు, సూర్యచంద్రారెడ్డి,  విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T03:06:15+05:30 IST