జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు పాండునాయక్‌

ABN , First Publish Date - 2020-10-04T09:19:51+05:30 IST

ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందామని ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్‌ పిలుపునిచ్చారు

జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు పాండునాయక్‌

ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందాం 

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్‌ 


జడ్చర్ల, అక్టోబరు 3: ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందామని ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్‌ పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో నియోజకవర్గ ఉప సర్పంచ్‌లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ తీర్మానాలపై సంతకాలకు ఉప సర్పంచ్‌లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై పేర్లు నమోదు చేయాలని కోరారు. మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం ఉండాలన్నారు. గౌరవ వేతనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రవికిరణ్‌, పాండునాయక్‌, మహంతి, మణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరినాయక్‌, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్‌ పూజారి, నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


నియోజకవర్గ అధ్యక్షుడిగా పాండు నాయక్‌

జడ్చర్ల నియోజకవర్గ ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా జడ్చర్ల మండలం కుర్వపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ పాండునాయక్‌ను ఎన్నుకున్నారు.

Updated Date - 2020-10-04T09:19:51+05:30 IST