-
-
Home » Telangana » Mahbubnagar » larybyke
-
లారీ, బైకు ఢీ: ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-07T03:25:33+05:30 IST
లారీ, బైకు ఢీకొని ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.

చారకొండ, డిసెంబరు 6: లారీ, బైకు ఢీకొని ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణదేవ తెలిపిన వివ రాల ప్రకారం.. కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లా రీ సారబండ తండా మూలమలుపు వద్ద బైకును ఢీకొట్టింది. మండలంలోని తుర్కలపల్లి గ్రామానికి చెందిన పర్శమోని సాయి, కట్ట సాయికుమార్, అనిల్‌కుమార్ బైకుపై జూపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పర్శమోని సాయి (20) అక్క డికక్కడే మృతి చెందగా, కట్ట సాయికుమార్, అనిల్ కుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పర్శమోని సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
రెండు బైకులు ఢీకొని మరొకరు..
ఉప్పునుంతల: రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉప్పునుంతల మండల పరిధిలోని కం సానిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూరు మండలం సీతారామా పురం గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డి(35) చింతపల్లి నుంచి అచ్చంపేట వైపు వెళ్తుండగా తిర్మలాపురం నుంచి చింతపల్లి వైపు వెళ్తున్న బాలయ్య రెండు బైక్‌లు కంసానిపల్లి సమీపంలో ఢీకొన్నాయి. దేవేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.