గజానికో.. పంచాయితీ

ABN , First Publish Date - 2020-07-19T07:14:28+05:30 IST

భూ వివాదాలకు, తగాదాలకు, గొడవలకు, హత్యలకు గోపాల్‌పేట కేంద్రంగా ..

గజానికో.. పంచాయితీ

  • భూ వివాదాలకు కేంద్రంగా గోపాల్‌పేట
  • భూ తగాదాలతో ఇటీవల ఓ మహిళ దారుణ హత్య
  • జీపీలకు కేటాయించిన భూమినీ విక్రయిస్తున్న వైనం


వనపర్తి, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : భూ వివాదాలకు, తగాదాలకు, గొడవలకు, హత్యలకు గోపాల్‌పేట కేంద్రంగా మారుతోంది. కావాలనే తప్పులు చేస్తూ రైతులను తి ప్పించుకునే అధికారులు కొందరైతే, ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు మ రికొందరు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు కోకొల్లలుగా నమోదవుతున్నా, గోపాల్‌పేటలో మాత్రం శ్రుతి మించుతున్నాయని చెప్పవచ్చు.


గతంలో ఇదే మండలా నికి చెందిన ఓ వృద్ధురాలు ఏకంగా కలెక్టరేట్‌ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయ త్నించగా, ఆమెకు అసలు భూమి లేనేలేదని అధికారులు తేల్చిచెప్పారు. ఇటీవల బుద్దారం గ్రామంలో తమ పొలం వేరే వాళ్లకు ఎక్కువ రిజిస్ర్టేషన్‌ చేశారని, ఆ వ్యక్తి భార్యను అతి కిరాతకంగా హతమార్చడం సంచలనం సృష్టించింది. గతంలో గోపాల్‌పే ట మండలం తాడిపర్తి గ్రామ పరిధిలో ఉన్న నర్సింగాయపల్లిలో అగ్రిగోల్డ్‌ కంపెనీ స ర్వేనంబర్‌ 305/అ, 305/అ లలో భూమిని కొనుగోలు చేసి, మొత్తం 13.38 ఎకరాల్లో ఫార్చున్‌ కృష్ణ దేవరాయ పేర వెంచర్‌ వేసింది. ఇందులో చాలామంది ప్లాట్లను కొనుగో లు చేశారు.


ప్లాట్ల కొనుగోలు సమయంలో తాడిపర్తి పంచాయతీకి 10 శాతం ల్యాండ్‌ ను కేటాయించారు. అందులో పార్కులు కడతామని చెప్పారు. ప్రస్తుతం అదే ప్రాంతం లో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుండటంతో డిమాండ్‌ ఏర్పడింది. దీంతో పం చాయతీకి కేటాయించిన స్థలంలో దాదాపు ఎకరా స్థలాన్ని విక్రయిస్తున్నారు. పార్కుల కోసం ఉద్దేశించిన స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి మింగేస్తున్నారు. 


పట్టణాలు, ప్రధాన గ్రామాలు, రోడ్ల వెంట ఉన్న పొలాలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గ్రామాలకు సైతం పాకడంతో అమ్మకాలు, కొ నుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భూ రికార్డుల ప్రక్షాళన కూడా కొన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటీవల బుద్ధారం గ్రామానికి చెందిన ఓ మహిళ తన తల్లి వీ లునామా ప్రకారం.. తమ పిల్లల పేరిట రిజిస్ర్టేషన్‌ అయ్యి, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయని, వారి పేరిట రైతుబంధు కూడా జమ అవుతుందని, అయితే తప్పుడు డా క్యుమెంట్లు సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని కలెక్టర్‌, ఆర్డీఓ, సబ్‌ రి జిస్ర్టార్‌, ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. భర్త చనిపోయి ఆసరా లేని తమకు అన్యాయం చే యవద్దని వేడుకున్నారు. అలాగే ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన ‘చెట్టాప ట్టాలు’ వార్త విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-19T07:14:28+05:30 IST